calender_icon.png 29 November, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ హామీతో రైతు ఆమరణ దీక్ష విరమణ

29-11-2025 12:56:18 AM

మాజీ ఎమ్మెల్యే విట్టల్‌రెడ్డి జోక్యంతో రైతులకు న్యాయం 

నిర్మల్, నవంబర్ 2౮ (విజయక్రాంతి): కుంటాల మండల కేంద్రంలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన సోయ పంటను ప్రభుత్వం పాపాస్ చేయడానికి నిరసిస్తూ ఉండల మండల కేంద్రానికి చెందిన రైతు దత్తు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం నిమ్మరసం అందించి విరమింపచేశారు . మూడు రోజులుగా రైతుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ఉదయం వైద్యులు రైతు ఆరోగ్యాన్ని పరీక్షించి ప్రభుత్వ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

దీనికి స్పందించిన ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి సమస్యను జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్లో వివరించి రైతులకు న్యా యం చేయాలని విజ్ఞప్తి చేయంగా వారు అనుకూలంగా స్పందించడంతో దీక్ష విరమింప చేశారు. రైతు దీక్షకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలు సం ఘీభావం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బుచ్చన్న మహేందర్ అశోక్ రెడ్డి వెంకటేష్ తదితరులు ఉన్నారు.