18-10-2025 01:20:30 AM
అలంపూర్ అక్టోబర్ 17:అష్టాదశ శక్తి పీఠాల్లో ప్రముఖ ఐదవ శక్తి పీఠమైన అలంపూర్ శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ ఈవో దీప్తి అర్చకులు మాజీ సీఎం, ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కు పూలమాలలు వేసి మేళ తాళాలతో స్వాగతం పలికారు. ముందుగా బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు.
అనంతరం జోగులాంబ దేవి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అంతకుముందు మాజీ సీఎం అలంపూర్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆన్సర్ అలీ ఖాన్, పరిశీలకులు సంధ్యారెడ్డి, రాష్ట్ర నాయకులు రాజేష్ రెడ్డి, గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరిత తిరుపతయ్య,జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీను, టెలికం అడ్వైజరీ కమిటీ మెంబర్ శంషాబాద్ ఇస్మాయిల్, ఆలయ మాజీ ధర్మకర్త భీమవరం శేఖర్ రెడ్డి,అడ్డాకుల రాము, నర్సన్ గౌడ్, క్యాతూరు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.