07-01-2026 12:00:00 AM
చౌటుప్పల్, జనవరి 6 (విజయక్రాంతి): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని హైదరాబాదులోని ఆయన నివాసంలో చౌటుప్పల్ కాంగ్రెస్ పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ నాయకులు బత్తుల విప్లవ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన పలువురు మున్సిపాలిటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, జిల్లా మత్స్య కార్మిక సంఘం అధ్యక్షులు పాశం సంజయ్ బాబు, నాయకులు కొండూరు వెంకటయ్య, కొయ్యడ సైదులు గౌడ్, కామిశెట్టి శైలజ భాస్కర్, అంతటి బాలరాజు గౌడ్, కొరగోని లింగస్వామి, పాక చిరంజీవి యాదవ్, మలిగే మల్లేశం, శంకర్, బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.