20-05-2025 01:23:08 AM
రూ.6,210కోట్ల భారీ కుంభకోణం
న్యూఢిల్లీ, మే 19: యూకో బ్యాంక్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ గోయెల్‌ను రూ.6,210కోట్ల భారీ కుంభకోణానికి సంబంధించి ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో ఈనెల 16న అరెస్ట్ చేసింది. 17వ తేదీన ఆయన్ను కోల్‌కతా లోని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరి చింది. కోర్టు ఈనెల 21వరకు గోయెల్‌కు ఈడీ కస్టడీ మంజూరు చేసింది. కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (సీఎస్‌పీఎల్) కు రుణాల మంజూరులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
సుబోధ్ కుమార్ గోయెల్ సహ మ రికొందరి నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. సీబీఐ నమోదు చేసి న ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీల్యాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తో ంది. సీఎస్‌పీఎల్ సంస్థకు క్రెడిట్ సౌ కర్యాలు మంజూరు చేయడం, ఆ తర్వాత రూ.6,210.72కోట్లకు పైగా రుణాలను భారీ మొత్తంలో మళ్లించ డం, దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ సంపాదనను పలు సంస్థల ద్వారా మళ్లించి, చట్టబద్ధమైన లావాదేవీలుగా చూపించే ప్రయత్నం జరి గిందని ఈడీ పేర్కొంది.
గోయెల్ డ బ్బు, స్థిరాస్తు లు, విలాసవంతమైన వస్తువులు, హోటల్ బుకింగ్‌లు వం టి వాటిని షెల్ కంపెనీలు, నకిలీ వ్య క్తులు, కుటుంబ సభ్యుల ద్వారా పొ ందారని, తద్వారా డబ్బు అసలు మూలాన్ని దాచిపెట్టారని విచారణ లో వెల్లడైంది. షెల్ కంపెనీల ద్వా రా కొనుగోలు చేసిన అనేక ఆస్తులను ఈడీ గుర్తించింది. ఈ సంస్థలు గో యెల్, అతడి కుటుంబసభ్యుల ఆధీనంలో ఉన్నాయని ఈడీ ఆరోపించి ంది.
ఈ కేసులో సీఎస్‌పీఎల్ ప్రధాన ప్రమోటర్ సంజయ్ సురేఖను ఈడీ డిసెంబర్ 2024లో అరె స్ట్ చేసింది. ఫిబ్రవరిలో అతడిపై చార్జ్‌షీట్ దాఖ లు చేసింది. సంజయ్ సురేఖ, సీఎస్‌పీఎల్‌కు సంబంధించిన రూ.510 కోట్ల విలువైన ఆస్తులను మనీ ల్యాం డరింగ్ చట్టం కింద జారీ చేసిన రెండు ఆదేశాల ద్వారా ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది.