20-05-2025 01:18:54 AM
శిథిలావస్థలో హుజూర్ నగర్ పబ్లిక్ క్లబ్
నాడు పట్టణానికే తలమానికం
నేడు ఆక్రమణకు అడ్డాగా మారిన వైనం
పూర్వ వైభవం తీసుకురావాలని పట్టణ వాసుల వేడుకోలు
హుజూర్‌నగర్, మే 19: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణం నడి బొడ్డున సుమారు 3 ఎకరాల స్థలం లో సువిశాలంగా పబ్లిక్ క్లబ్ ను 1947 కి పూర్వం నిజాం నవాబులు నిర్మాణం చేశారు.
అప్పటి నుండి క్లబ్ పట్టణానికే తల మానికం గా వెలుగొందింది.2000 సం వంత్సరం వరకు బాగానే ఉన్నా ప్రభుత్వం నుండి నిధులు సరిపడా లేక నిర్వహణ,పట్టించుకునే వారు లేక నిరుపయోగంగా మారి పోయింది. కాలక్రమేణా క్లబ్ కొంతమంది వ్యక్తుల స్వార్థపూరిత చేతల కారణంగా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది.
సుమారు 300 మంది శాశ్వత సభ్యులు ఉన్నప్పటికి రాను, రాను అసలు క్లబ్ ఉన్న విషయమే ప్రజలు మరచిపోయేలా అయింది. ఎందుకు కారణం లేకపోలేదు. నియోజకవర్గంలో భూ భాకాసురుల పుణ్యాన ఆక్రమణకు గురికాని దంటు ఏమీ లేకుండా పోయింది.
ఆక్రమణకు ఏదీ కాదు అనర్హం అన్న చందంగా ఎక్కడ ఖాళీ జాగా కనపడ్డ అక్ర మించుకోవడంతో చివరకు క్లబ్ స్థలం ఉందా.. కబ్జాకు గురైందా..! దీనికి పూర్వ వైభవం లభిస్తుందా అన్నదే వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.
మూతబడ్డ క్లబ్ : దానికి తోడు క్లబ్ స్థలం మాది అని కొందరు కోర్టుకి వెళ్లినట్లు తెలియడం తో క్లబ్ మూతపడింది. అదే అదునుగా చేసుకున్న కొంతమంది క్లబ్ పరిసర ప్రాంతాల వారు కొంతమేర ఆక్రమించుకున్నారు.
ఇది ఇలా ఉంటే పట్టణంలోని వాహనదారులు తమ వాహనాలను క్లబ్ లో పార్కింగ్ చేసి అక్కడ నుండే కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీంతో శిథిలావస్థలో క్లబ్ ఉండటం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్లబ్ ను ఉపయోగంలోకి తేవడానికి క్లబ్ శాశ్వత సభ్యులు నడుం బిగించి పాత భవనానికి పక్కనే ఉన్న మరొక భవనాన్ని ముందుగా ఉపయోగం లోకి తీసుకరావాలని పట్టణవాసులు కోరుతున్నారు.
అలాగే ఆక్రమణకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకుని, ఆవరణలో నిలుపుదల చేస్తున్న వాహనాలను మరోసారి అలా చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. క్లబ్ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయిం చేందుకు ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా సంబంధిత వ్యక్తులతో శాశ్విత సభ్యులు మాట్లాడి క్లబ్ పరిస్థితిని వివరించి, హుజూర్నగర్ పబ్లిక్ క్లబ్ పట్టణానికే కాకుండా జిల్లాకు మణిహారం గా ఉండేటట్లు చేయాలనీ ప్రజల ఆకాంక్షిస్తున్నారు.
క్లబ్ పబ్లిక్‌కి ఉపయోగ పడేలా చేయాలి
పబ్లిక్ క్లబ్ శిదిళావస్థకు చేరుకుంది. క్లబ్ ను ఉపయోగం లోకి తీసుకొచ్చి జిల్లాకు తలమానికంగా ఉండేటట్లు చేయాలి. పబ్లిక్ క్లబ్ కు పూర్వ వైభవం వస్తే అందరం సంతోషంగా ఉంటాం.
వీర్లపాటి భాస్కర్, హుజూర్‌నగర్