calender_icon.png 20 November, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్‌ను సన్మానించిన గాంధారి మాజీ జడ్పీటీసీ

20-11-2025 12:41:08 AM

 గాంధారి, నవంబర్ 19 (విజయ క్రాంతి):  నిర్మల్ జిల్లా బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ను బుధవారం రోజున టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, గాంధారి మాజీ జెడ్పిటిసి తానాజీ రావు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన గాంధారి మండలంలో రైతులు పండించే ప్రధాన పంటలతో పాటు, పంటల ధరలను, రైతుల యొక్క ప్రధాన సమస్యలను ఆయనకు అడిగి తెలుసుకున్నారు. గాంధారి మండలంలో ప్రధానంగా వరి, మొక్కజొన్న,సోయా వంటి ప్రధాన పంటలు పండుతాయని చైర్మన్ కు మాజీ జెడ్పిటిసి తానాజీ రావు వివరించారు. పార్టీల అతీతంగా రైతులకు మార్కెట్ లో సమస్యలు లేకుండా చూడాలని ఆయన సూచించారు.