20-11-2025 12:39:49 AM
దిశ సమావేశంలో అభివృద్ధి పనులపై సమీక్ష
మెదక్, నవంబర్ 19(విజయక్రాంతి): మెదక్ జిల్లాలో త్వరలోనే క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, రూ. 69.59 లక్షలతో బస్సు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ప్రజలకు క్యాన్సర్ వైద్య సేవలు అందించనున్నట్లు మెదక్ ఎంపీ రఘునందన్రావు తెలిపారు. బుధవారం జిల్లా అభి వృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ (దిశ ) సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగింది.
ఈ సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షత వహించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల ప్రగతి, పథకాల అమలులో ఎదురయ్యే సమస్యలు, వీటి పరిష్కారం, బడ్జెట్ వినియోగం, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, నిధుల వినియోగం తదితర అంశాలను సమీక్షించారు.
గత సమావేశంలో చేసిన సిఫార్సులపై తీసుకున్న చర్యలపై వివరమైన చర్చ జరిగింది. అభివృ ద్ధి కార్యక్రమాలపై ఫీల్ లెవల్ మానిటరింగ్ పెంచాలని, ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడాలని తెలిపారు. అధికా రులందరూ సమన్వయంతో పనిచేసి, మెదక్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు.
త్వరలో మెదక్లో క్యాన్సర్ ఆసుపత్రి
ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన పెం పొందించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఇందులో భాగంగా మెదక్ లో నూతన క్యాన్సర్ హాస్పిటల్ ను నిర్మాణం చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో 1000 గజాల స్థలం ఏర్పాటు చేసే విధంగా పటిష్ట కార్యచరణ ద్వారా చర్య లు తీసుకుంటున్నా మన్నా రు . కేంద్ర ప్రభు త్వ నిధులు, కొత్త పథకాలు ప్రతి ఇంటికి చేరవేసే విధంగా దిశ కమిటీ లో చర్చించడం జ రిగిందని తెలిపారు.
జిల్లాలో పెండింగ్ ఉన్న నేషనల్ హైవే అంశాలు అటవీ శాఖ అనుమతులు నరసాపూర్ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న నేషనల్ హైవే 765 డి.జి రోడ్డుకు సంబంధించి, గుమ్మడిదల నర్సాపూర్ ఎలివెంటల్ క్యారిడార్ డిపిఆర్ సం బంధించి చర్చించడం జరిగిందని తెలిపారు. ప్రైవేట్ సంస్థల యాజమాన్యాన్ని ఒప్పించి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఏ జిల్లాలో ప్రారంభం కాని విధంగా మెదక్ జిల్లాలో 1000 గజాల స్థలం లో క్యాన్సర్ ఆస్పత్రి ని ర్మించి క్యాన్సర్కు చికిత్సలు అందించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
736 జిల్లాలో ఎక్కడా ప్రారంభం కానీ ప్రిలిమినరీ క్యాన్సర్ టెస్టింగ్ మెదక్లో ప్రారంభం కావడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. జిల్లాలు ప్రతి వారం మండల కేంద్రంలో క్యాన్సర్ ప్రిలిమినరీ పరీక్షల కొరకు ఒక బస్సు తయారు చేస్తున్నట్లు భారత్ రాజ్ నిక్ సంస్థ ముందుకు వచ్చిందని పీడీఎల్ పటాన్చెరువు వారు ఒక బస్సు కొనుగోలు చేసి ఇవ్వడానికి సిఎస్‌ఆర్ నిధులు కింద లెటర్ అందజేయడం జరిగిందన్నారు.
ఈ బస్సు ద్వారా ప్రతి మండల కేంద్రంలో హై స్కూల్ ఆవరణలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేసి చికిత్స చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రఘునందన్ రా వు కూతురు స్వయానా డాక్టర్ కావడంతో బ స్సు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా క్యాన్సర్ కు వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ దిశ మీటింగ్లో చర్చించిన అంశాలను, సమస్యలను అధికారులు పష్కరించాలని తెలిపా రు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ భుజంగరావు, డిఆర్డీఓ పీడి శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.