calender_icon.png 9 August, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే సహకారంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

09-08-2025 07:23:24 PM

చండూరు/గట్టుప్పల (విజయక్రాంతి): గట్టుప్పల్ మండలం(Gattuppal Mandal) తెరటుపల్లి గ్రామ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Raj Gopal Reddy) ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుండి 15 లక్షలు మంజూరు చేయించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నామని జగన్నాథం ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. అడగగానే నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ వీరమల్ల శ్రీశైలం,గ్రామ శాఖ అధ్యక్షులు గిరి శంకర్, బండారి రాములు, చలమల్లఇంద్రారెడ్డి, బెధరకోట శ్రీనివాసులు, మల్లేష్,,లక్ష్మయ్య, ముత్తయ్య, రవి, ఆంజనేయులు, వెంకన్న, శ్రీకాంత్ పాల్గొన్నారు.