09-08-2025 09:58:12 PM
రక్ష బంధన్ రోజున తమ్ముడి రక్షణకు హెల్మెట్ బహుకరణ..
అదిలాబాద్ (విజయక్రాంతి): ఎప్పుడు ప్రజా సమస్యల కోసం పరితపించే తన తమ్ముడు వాహన ప్రయాణ సమయంలో ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని కోరుతూ రక్షా బంధన్(Raksha Bandhan) సందర్భంగా తమ్ముడికి అక్క హెల్మెట్ ను అందజేశారు. యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ కి శనివారం రాఖీ కట్టిన అతని అక్క సునీత తమ్ముడి రక్షణ కోసం హెల్మెట్ ను అందించింది. రాఖీ పండగ సందర్భంగా తన అక్క రాఖీ కట్టి హెల్మెట్ భహుకరించడంతో ఆమె నిర్ణయానికి ఆశ్చర్యపోయిన ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, తన అక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి పాదాభివందనం చేసాడు.