calender_icon.png 9 August, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రాఖీ వేడుకలు

09-08-2025 07:25:40 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): అన్నాచెల్లెళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్(Raksha Bandhan) వేడుకలు శనివారం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టారు. సోదరులు తమ ఆడబిడ్డల ఆశీర్వాదాలు పొందారు. తోచినంత కట్నకానుకలను సోదరీమణులకు అందించి వారి దీవెనలను పొందారు. డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్(MLA Jatoth Ramachandru Naik)కు ఆయన సోదరీమణులు లకావత్ శకుంతల, తేజావతి ఇందిర రాఖీలు కట్టారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కు సోదరీమణులతో పాటు పట్టణ కాంగ్రెస్ మహిళా నాయకులు రాఖీలు కట్టారు. మాజీ ఎంపీ, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాలోత్ కవిత పలువురు బిఆర్ఎస్ నాయకులకు రాఖీలు కట్టారు.