calender_icon.png 10 August, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా భారత యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

09-08-2025 09:34:53 PM

ఘట్ కేసర్: భారత యువజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవంను శనివారం ఘట్ కేసర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్క సంజీవ రెడ్డి(Congress President Bokka Sanjeeva Reddy) ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎంతో మందిని నాయకులని తయారు చేసి దేశంనికి సేవ చేసే అవకాశం యూత్ కాంగ్రెస్ నాయకులకి లభించిందని తెలిపారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకు చేరే విధంగా యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలియజేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిందిగా కోరడమైనది. ఈకార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రఫీయుదిన్, కార్తీక్, సాయి చరన్, బాలకృష్ణ, దామోదర్ రెడ్డి, సల్మాన్ రాజు, నిఖిల్, వివేక్ రెడ్డి, హరివార్ధన్, మణికంఠ, బాబుల్ తదితరులు పాల్గొన్నారు.