09-08-2025 07:21:03 PM
ప్రత్యేక బస్సు నడిపిన డిపో అధికారులు..
నిర్మల్ (విజయక్రాంతి): రక్షాబంధన్(Raksha Bandhan)తో పాటు గురుకులాల్లో ఉన్న విద్యార్థులకు కలుసుకునేందుకు రెండో శనివారం కలిసి రావడంతో టీజీ ఆర్టీసీకి ప్రయాణికులు పోటెత్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6:00 వరకు నిర్మల్ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది. సోదరులకు సోదరిమణులు రాఖీలు కట్టేందుకు సొంత ఊర్లకు వెళ్లడంతో ఏ బస్సు చూసిన జనంతో నిండిపోయి ఎక్కడానికి వీల్లేకుండా పోయింది. రెండవ శనివారం కూడా కావడంతో గురుకులంలో ఉన్న పిల్లలకు రాఖీలు కట్టేందుకు ఆడపిల్లలతో తల్లి వెళ్ళడంతో రద్దీ మరింత పెరిగింది. నిర్మల్ డిపో అధికారులు రద్దీని దృష్టిలో పెట్టుకొని రద్దీ ఉన్న ప్రదేశాలకు అప్పటికప్పుడు తాత్కాలిక బస్సులను ఏర్పాటు చేశారు. నిర్మల్ డిఎం పండరీ స్టేషన్ మేనేజర్ ఏ ఆర్ రెడ్డి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసుకుని బస్సులు నడపడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు