31-12-2025 01:16:37 AM
ములకలపల్లి,డిసెంబర్ 30,( విజయక్రాంతి): మండల పరిధిలోని తిమ్మంపేట గ్రామ పంచాయతీ కార్యాలయ అదనపు గదుల నిర్మాణానికి మంగళవారం సర్పంచ్ తుర్రం శ్రీనివాస్ ఘనంగా శంకుస్థాపన చే శారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, కొ బ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. నూతన పాలకవర్గం తొలి అడుగు. గ్రామ పంచాయతీకి నూతన పాలకవర్గం ఎన్నికైన తర్వాత చేపట్టిన మొదటి అధికారిక కార్యక్ర మం ఇదే కావడం విశేషం.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పం చాయతీ భవనం పాతది కావడంతో పాటు, రికార్డులు భద్రపరుచుకోవడానికి తగినన్ని స్టోర్ రూమ్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. భవిష్యత్తు అవసరాల ను, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ అదనపు గదుల నిర్మాణాన్ని చేపట్టి నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో పాలకవర్గ సభ్యులతో పాటు గ్రామ పెద్ద లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప స ర్పంచ్ సాయినాథ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు, వివిధ వార్డుల సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.