calender_icon.png 31 December, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్1పై ముగిసిన వాదనలు

31-12-2025 01:22:46 AM

  1. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
  2. జనవరి 22న వెలువరించనున్న ఉన్నత న్యాయస్థానం

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): తెలంగాణ గ్రూప్1 సెలక్షన్ లిస్టుపై జనవరి 22న తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించనుంది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. గ్రూప్1 ఫలితాలను రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతోపాటు పలువురు ఉద్యోగులు దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ ముగిసింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు జనవరి 22న తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది.

టీజీపీఎస్సీ తరపున అడ్వకేట్ జనరల్ ఏ.సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ నిబంధనల ప్రకార మే పరీక్షలు జరిగాయని తెలిపారు. మూల్యాంకనంలో అవకతవకలు జరగకూడదన్న లక్ష్యంతో ఇద్దరితో చేయించినట్లు కోర్టుకు వివరించారు. పాలనాపరమైన సౌలభ్యం, పరీక్ష కేంద్రాల పెంపు కోసం గ్రూప్1 ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు వేర్వేరుగా హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ జారీ చేసిందని తెలిపారు.

సీనియర్ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి అర్హత సాధించిన అభ్యర్థుల తరపున కోర్టుకు వాదనలు వినిపిస్తూ పరీక్షల్లో అర్హత సాధించలేనివారు కోర్టును ఆశ్రయించారని తెలిపారు.  గ్రూప్1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు, మార్కుల జాబితాలో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించ డంతో ఈ జాబితాను సింగ్ బెంచ్ రద్దు చేయడంతో డివిజన్ బెంచ్‌కు టీజీపీఎస్సీ, అర్హత సాధించిన అభ్యర్థులు అప్పీల్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.