calender_icon.png 31 December, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా పంపిణీకి ప్రత్యేక అధికారులు

31-12-2025 01:57:48 AM

ఒక్కొక్కరికి నాలుగైదు జిల్లాల కేటాయింపు

వ్యవసాయ శాఖ డైరెక్టర్ బీ.గోపి

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి) : యాసంగి సీజన్‌లో యూరియా పంపిణీకి వ్యసాయ శాఖ డైరెక్టర్ డా.బీ. గోపి ప్రత్యేక అధికారులను  నియమించారు. జిల్లాల్లో యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా ప్రత్యేక అధికారులు మానిటరింగ్ చేయనున్నారు. ఇందులో భాగంగా అడిషనల్ డైరెక్టర్లు కే. విజయ్‌కుమార్, బీ.నర్సింహా రావు, జేడీఏలు ఎస్.గీత, వీ.ఆశాకుమారి, వై.సుచరిత, బీ.బాలు, ఎం.శైలజ, డీడీఏలు ఎం.చంద్రశేఖర్, ఎం.కనుక రాజులకు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ప్రత్యేక అధికారికి నాలుగైదు జిల్లాలను కేటాయించారు. పైల ట్ ప్రాజెక్టు కింద యూరియా యాప్ కొనసాగుతున్న ఐదు జిల్లాల్లో కాకుండా మిగతా జిల్లాల్లో కూడా యూరియా సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోనున్నారు.