calender_icon.png 31 December, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కాలర్‌షిప్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలి

31-12-2025 01:07:39 AM

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 30(విజయక్రాంతి): ప్రి, పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ప్రి, పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు, తదితర అంశాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జిల్లా అధికారులు, ఎంఈఓలు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యంలోని ఆడిటోరియంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రమ అగ్రవాల్ మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని మండలాల్లో  ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ దరఖాస్తులు లక్ష్యం మేరకు పూర్తి చేయాలని సూచించారు.

అర్హులైన విద్యార్థులు అందరూ ప్రి,పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అన్నారు. స్కాలర్షిప్ నమోదు కోసం ఎవరికైనా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేకుంటే వాటిని వెంటనే సంబంధిత విద్యార్థికి అందించే బాధ్యత సంబంధిత తహసీల్దార్ చూసుకోవాలని స్పష్టం చేశారు. అర్హులైన అందరు విద్యార్థులు పోస్ట్ ,ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం నమోదు అయ్యేలా చూడాలన్నారు.సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, డీఈఓ వినోద్ కుమార్, డీఎస్సీడీఓ రవీందర్ రెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ భారతి, ఎల్డీఎం మల్లికార్జున రావు తదితరులు ఉన్నారు.