31-12-2025 01:56:59 AM
తెల్లవారుజాము నుంచే క్యూ
భద్రాచలం, డిసెంబర్ 30 (విజయక్రాంతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా మం గళవారం రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనాలు చేసుకున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో మంగళవారం ముక్కో టి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు.
వైకుంఠ రాముడిగా అలం కరించబడిన స్వామివారి దివ్య దర్శనంతో భక్తులు పరవశించి, శ్రీ రామ జయ రామ జయ జయ రామ అనే జయజయధ్వానాలతో భద్రాద్రి క్షేత్రం మారుమోగింది. వేద పండితులు, స్థానాచార్యులు ముక్కోటి ఏకాదశి విశిష్టతను వివరించగా, అర్చకులు 108 ఒత్తులతో మహా హారతి నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారం ద్వారా దర్శ నం అనంతరం ఉత్సవ మూర్తులను మాడ వీధుల్లో భక్తిశ్రద్ధల మధ్య ఊరేగించారు.
స్వామివారు గరుడ వాహనరూపుడిగా శ్రీమహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. భక్తరామదాసు కాలం నుంచీ కొనసాగుతున్న సంప్రదాయం ప్రకా రం భద్రాచలం తహసీల్దార్ శ్రీనివాస్ మూ లవిరాట్టులకు స్నపన కార్యక్రమం నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహు డిని తెల్లవారుజామునే ఉత్తర ద్వారం భక్తు లు దర్శించుకున్నారు. అలాగే రాష్ట్రంలోని ఇతర ఆలయాల్లోనూ భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.