calender_icon.png 8 September, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు గోదావరి తాగునీటి పథకానికి శంకుస్థాపన

08-09-2025 02:05:23 AM

  1. ఉస్మాన్‌సాగర్ వద్ద ఫేజ్- 2, 3 పనులు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
  2. హ్యామ్‌విధానంలో రూ.7,360 కోట్లతో ప్రాజెక్ట్ చేపట్టనున్న ప్రభుత్వం
  3. మూసీ పునరుజ్జీవన పథకంలో కీలక అడుగు

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర ప్రజలకు ప్రతి రోజు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా గోదావరి తాగునీటి పథకానికి సంబంధించి ఫేజ్- 2, 3 పనులకు సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉస్మాన్‌సాగర్ వద్ద శంకుస్థాపన చేయనున్నారు. దీంతో మూసీ పున రుజ్జీవన పథకంలో కీలక ముందడుగు ప డింది. మూసీ పునరుజ్జీవన పథకంలో భా గంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువులను మంచినీటితో నింపేందుకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ -2, 3 పథకాన్ని ప్రారంభించాలని ప్ర భుత్వం నిర్ణయించింది.

రూ.7,360 కోట్లతో ప్రభుత్వం హ్యామ్ విధానంలో ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఇందులో ప్రభుత్వం 40 శాతం పెట్టుబడి వాటా పెట్టనుండగా, కాంట్రాక్ట్ కంపెనీ 60 శాతం నిధులు సమకూరుస్తుంది. రెండేండ్లలో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలి స్తా రు. అందులో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నింపి మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీలు కేటాయిస్తారు.

మిగతా 17.50 టీఎంసీలు హైదరా బాద్ తా గునీటి అవసరాలకు వినియోగిస్తారు. మార్గమధ్యలో ఉన్న 7 చెరువులను నింపుతారు. 2027, డిసెంబర్ నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు, ప్రతిరోజూ నల్లా నీటిని సరఫరా చేయడం ప్రాజెక్టు లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఓఆర్‌ఆర్ ఫేజ్-2లో భాగంగా జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సి పల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలకు తాగునీటి సరఫరా చేపట్టిన ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు.

రూ. 1,200 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 71 రిజర్వాయర్లు నిర్మించారు. వీటిలో కొత్తగా ఇటీవల నిర్మించిన 15 రిజర్వాయర్లను సీఎం ప్రారంభించనున్నారు. సరూ ర్‌నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కీసర, రాజేంద్రనగర్, షామీర్‌పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్‌సీపురం, పటాన్‌చెరు, బొలా రం.. మొత్తం 14 మండలాల్లోని 25 లక్షల మందికి తాగునీరు అందుతుంది.

కోకాపేట్ లేఅవుట్ సమగ్ర అభివృద్ధి - నియో పోలీస్--సెజ్‌కు తాగునీటితో పాటు మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేసే రూ.298 కోట్ల ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేస్తారు. రెండేండ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుతో 13 లక్షల మంది లబ్ధి పొందుతారు.