calender_icon.png 8 September, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘విజయ యాత్ర’ పుస్తకావిష్కరణ

08-09-2025 02:05:20 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): విజయలక్ష్మి సాహితి, వైద్య సేవ సేవా యాత్ర పుస్తకాన్ని ఆదివారం ఉదయం నిజాంపేటలోని సప్తపది  గార్డెన్స్‌లో ఆవిష్కరించారు. నాలుగు దశాబ్దాల స్నేహం, ఎనిమిది దశాబ్దాల జీవన యాత్ర, సేవా సప్తపది నడకలో, సజీవ స్ఫూర్తి మార్గంలో డాక్టర్ విజయలక్ష్మి ఆలూరి 80వ జన్మదినోత్సవం కుటుంబ సమేతంగా విజయవంతంగా నిర్వహించారు.

అమ్మ అనగానే ఆశ్రయం, ఆప్యాయత, అద్భుత జీవనయానం గుర్తుకొస్తాయి. అమ్మ ప్రేమే కుటుంబానికి పునాది. ఆ ప్రేమకు పంచదార జోడించిన వేడుక ‘విజయయాత్ర’. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ (సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత), డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, (వ్యవస్థాపకులు, లోకసత్తా), వివి లక్ష్మీనారాయణ, ఐపీఎస్(మాజీ జాయింట్ డైరెక్టర్, సీబీఐ), మామిడి హరికృష్ణ (డైరెక్టర్, భాషా, సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం), చిన్న వీరభద్రుడు, ఎంతోమంది రచయిత్రులు పాల్గొన్నారు. 

డాక్టర్ ప్రణవి స్వాగతంతో ప్రారంభమైన ఈ  కార్యక్రమం వంశీ కృష్ణ వందన  సమర్పణతో ముగిసింది. స్మారక సౌవెనీర్ తొలి ప్రతిని దాసరి జైరమేష్ (చైర్మన్, విజయ్ ఎలక్ట్రికల్స్, హైదరాబాద్) ధర్మ పత్నికి అందించారు. తెలుగు సాహిత్య లోకాన్ని మమతతో నింపిన సీనియర్ మహిళా రచయిత్రులు బోయి హైమావతి భీమన్న, ఆచార్య శరత్ జ్యోత్స్నా రాణిలను సముచిత రీతిలో సత్కరించారు.

కాగా ఆలూరి విజయలక్ష్మి బహుముఖీన ప్రజ్ఞ పాటవాలతో కూడిన జీవనాన్ని పుస్తకంగా ముద్రించి సావనీర్ రూపంలో ఆవిష్కరించిన ఈ కార్యక్రమంలో దాదాపు నాలుగు తరాలుగా 12 మంది డాక్టర్లను తమ కుటుంబం నుండి సమాజానికి అందించి’డాక్టర్స్ కుటుంబం’గా ఆత్మీయంగా పిలవబడుతున్న కుటుంబంలో రెండో  తరం నుంచి వచ్చారు విజయలక్ష్మి. విజయలక్ష్మి నాలుగు దశాబ్దర సాహితీయాణం, ఆరు దశాబ్దాల పాటు సాగిన వైద్య బంధం,

ఇక ఆరు దశాబ్దాల స్నేహ ప్రయాణంలో వైద్యురాలిగా కవయిత్రిగా, రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా, అనువాదకురాలిగా విశిష్ట సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విజయ యాత్ర పుస్తకం ఆవిష్కరణతో పాటుగా సాహిత్యం వెలుగులకు ఆరోగ్య బలం అంటూ రచయితలకు ఆరోగ్య పథకం ప్రారంభం చేశారు. సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ వెబ్ సైట్ లాంచ్ చేసారు.

రాంకో డాక్టర్స్‌కి చెక్, బాలిక సంరక్షణ బాలిక సంక్షేమం నిమిత్తం ఆడపిల్లల పోషణ కోసం, వికాసం కోసం స్కాలర్షిప్ అందించడం గొప్ప సేవగా అతిధులు  కొనియాడారు. విజయలక్ష్మి ఆలూరి మీద వీడియో ఆవిష్కరణ కూడా జరిగింది. డాక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. ముందుగా వైద్యం, సాహితీ సేద్యం, కుటుంబ బాధ్యతల నిర్వహణ ఈ మూడింటిని సమర్థవంతంగా బాలన్స్ చేయగల ఇటువంటి వ్యక్తులు నేటి తరానికి ఆదర్శనీయమని అన్నారు.