22-08-2025 10:38:38 PM
గార్ల,(విజయక్రాంతి): బ్యాంకుకు సంబంధించిన కారు(TS09UD6561), ద్విచక్ర వాహనం ఢీకొని గార్లకు చెందిన బాదం సురేందర్(40) మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా, గార్ల పట్టణ కేంద్రానికి చెందిన బాదం సురేందర్ మత్స్య కార్మికులకు వలలు, చేపల పెంపకానికి కావలసిన దాణ,చేపల వేటకు ఉపయోగించే బోట్ల మరమ్మత్తులకు కావలసిన సామాగ్రిని ఖమ్మంలో కొనుగోలు చేసి తిరిగితన ద్విచక్ర వాహనంపై గార్లకు వస్తున్న క్రమంలో గార్ల-డోర్నకల్ మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదానికి గురైనట్లు మత్స్య కార్మికులు తెలిపారు.
బాదం సురేందర్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేక కేసులు అనుభవించినారు. గార్ల మండల మత్స్య కార్మికుల సంఘంకు అధ్యక్షునిగా పలుమార్లు సేవలందించారు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాదం సురేందర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రజలు ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.