22-08-2025 10:33:23 PM
సదాశివనగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని తిమ్మాజివాడి గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హాజరై పాల్గొన్నారు.గ్రామంలో ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమంలో భాగంగా తిమ్మాజివాడి గ్రామంలో చాకలి ఎంకవ్వ పశువుల షెడ్డు ప్రారంభించారు. పశువుల షెడ్డు సంబంధించిన పేమెంట్ చెక్కు రూపంలో అందజేశారు. ఇంకుడు గుంతల నిర్మాణానికి నాడెపు కంపోస్టు నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభించారు.ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు.
ఐకెపి ద్వారా లోన్ ఇప్పించి త్వరగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామ సభలో ఉపాధి హామీ ద్వారా చేపడుతున్న పనులను సమీక్షించారు.ఎక్కువ పని దినాలు పూర్తి చేసిన ఉపాధి హామీ కూలీ లను సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ సంగ్య నాయక్,మండల ప్రత్యేక అధికారి శ్రీ సతీష్ యాదవ్,జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సురేందర్,మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్, తాసిల్దార్ సత్యనారాయణ, ఏపీవో శ్రీనివాస్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.