22-08-2025 10:21:19 PM
శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మదరాసి’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆయనకు క్రూషియల్ కమ్ బ్యాక్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ఇందులో శివకార్తికేయన్ పూర్తి మాస్, ఫియర్స్ లుక్‌లో కనిపించనున్నారు. రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ ‘సెలవికా’తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 24న జరగనుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శ్రీలక్ష్మీ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.