calender_icon.png 23 August, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ కేవైసీ తప్పని సరి: టీజీబీ మేనేజర్ నరసింహ స్వామి

22-08-2025 10:25:37 PM

నస్పూర్,(విజయక్రాంతి): భారతీయ రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ విధి ‘ఈ కేవైసీ’ చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు సీతారాం పల్లి శాఖ బ్రాంచి మేనేజర్ జీ నరసింహస్వామి శుక్రవారం కోరారు. ఇందు కోసం ఖాతాదారులు ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాడకంలో ఉన్న ఫోన్ నెంబరును బ్యాంకు శాఖలో ఇవ్వాలని, బ్యాంకు సిబ్బంది వాటిని ఖాతాదారుల ఖాతాకు అనుసంధానం చేస్తారన్నారు. ఇలా చేసుకోవడం వల్ల ఖాతా నిర్వహణ సులభమవుతుందన్నారు. ఈ-కేవైసీ చేసుకోనివారందరు బ్యాంకులో వారి ఆధార్, పాన్ కార్డు, ఫోన్ నెంబరు లను అందజేయాలని కోరారు.