calender_icon.png 23 August, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపే ఎల్లారెడ్డికి మందకృష్ణ మాదిగ రాక

22-08-2025 10:56:16 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో పెన్షన్ దారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నిర్వహించే సభలో పాల్గొనేందుకు  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఎల్లారెడ్డికి రానున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంతి పద్మారావు శుక్ర వారం  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సమావేశం నిర్వహించనున్న పట్టణంలోని బాలా గౌడ్ ఫంక్షన్ హాల్ను సందర్శించినy అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో పెన్షన్ దారులకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచి ఇవ్వాలన్నారు. లేకుంటే వచ్చే నెల 9వ తేదీన రాష్ట్ర రాజధానిలో పెన్షన్ దారులందరితో కలిసి భారీ బహిరంగ సభనిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. శనివారం బా లాగౌడ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించబోయే పెన్షన్ దారుల సభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన  కోరారు.