20-10-2025 01:47:22 AM
విచారణ జరుపుతున్న పోలీసులు
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పట్టాభిరామ్‌లో ఘటన
చెన్నై, అక్టోబర్ 19: దీపావళి పర్వదినం వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా పటాకులు కొనుగోలు చేసి నిల్వ చేసిన ఓ ఇంటిలో పేలుడు సంభవించడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుం ది. ఆ రాష్ట్రంలోని చెన్నై సమీపంలో తిరువళ్లూరు జిల్లా పట్టాభిరామ్ ప్రాంతంలోని ఓ ఇంటిలో నిల్వ ఉంచిన పటాకులు ఒక్కసారిగా పేలాయి. పేలుడు ధాటికి ఇంటిలోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
విష యం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రు లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపా రు. అలాగే పేలుడికి గల కారణాలు ఏంటన్నది ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల కుటంబ సభ్యులు, బంధు వులు కన్నీరుమున్నీరుగా విలపించారు.