08-01-2026 11:14:33 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని మోకిల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలోని మీర్జాగూడ గేట్ సమీపంలో ఓ స్పోర్ట్స్ కారు అధిక వేగంతో అదుపు తప్పి, రోడ్డు డివైడర్‌ను, చెట్టును ఢీకొట్టింది. కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అదుకున్న మోకిలా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
వాహనంలో ఐదుగురు విద్యార్థులు ఉన్నారని, వీరు మంది ఐసీఎఫ్‌ఐఐ విశ్వవిద్యాలయం (ఐబీఎస్)లో చదువుతున్నారని, మృతులను రెండవ సంవత్సరం బిబిఎ విద్యార్థి సూర్య తేజ, మూడవ సంవత్సరం బిబిఎ విద్యార్థులు సుమిత్- శ్రీ నిఖిల్, ఎంజిఐటి విద్యార్థి రోహిత్‌గా పోలీసులు గుర్తించారు. గాయపడిన విద్యార్థిని, మూడవ సంవత్సరం బిబిఎ విద్యార్థి నక్షత్ర నగరంలో చికిత్స పొందుతున్నట్లుగా తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం పరీక్ష కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగమేనని అనుమానిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.