16-11-2025 12:25:52 AM
బంగారం, వెండి, నగదు, వాహనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డీసీపీ కరుణాకర్
సుల్తానాబాద్, నవంబర్ 15 (విజయక్రాం తి):పోలీసులమని చెప్పి ఒక ఇంటిలో దోపిడీ చేసిన నలుగురు దొంగలను అరెస్ట్ చేసినట్లు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు. వారి వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలతో పాటు 10వేల రూపాయల నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. శనివారం రాత్రి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డీసీపీ వెల్లడించారు.
ఈ నెల 10న సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో సంకరి లక్ష్మి ఇంటికి అగంతకులు వెళ్లి తాము కరీంనగర్ వన్ టౌన్ పోలీసులమంటూ వారిని బెదిరించారు. మీ ఇంట్లో దొంగ నోట్లు ఉన్నాయి అన్న సమాచారం మేరకు మేం కరీంనగర్ నుంచి వచ్చామని ఇంటిలో ఉన్న లక్ష్మి కుమారుడికి బేడీలు వేశారు. తర్వాత ఇంటిలో ఉన్న దాదాపు 15 లక్షల రూపాయల విలువగల బంగారం ఆభరణాలు, కొన్ని వెండి ఆభరణాలు, పదివేల రూపాయలు నగదు తీసుకొని వెళ్లారు. దీంతో బాధితులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ నలుగురు దొంగలు శనివారం బంగా రం అమ్మడానికి కరీంనగర్‌కు వాహనంలో వెళ్తుండగా కాట్నపల్లి వద్ద అరెస్ట్ చేసి వారి నుంచి బంగారం, వెండి ఆభరణాలు, నగదు తో పాటు ఒకటి జైలో... ఒకటి వ్యాగానర్, ఒక టి టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనం స్వాధీ నం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.ఏసీపీ జి, కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐలు శ్రావణ్ కుమార్, సనత్‌రెడ్డి, వెంకటేష్‌లు ఉన్నారు. ఎంతో చాకచక్యంగా నలుగురు దొంగలను పట్టుకున్న సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐలు శ్రావణ్ కుమార్, సనత్ రెడ్డి , వెంకటేష్ తో పాటు పలువురు పోలీసులను డీసీపీ అభినందించి రివార్డులు అందజేశారు.