16-11-2025 12:27:31 AM
ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను కోరిన ఏఐఎస్‌ఎఫ్
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాం తి): ఉస్మానియా యూనివర్సిటీలో గత వీసీ హయాంలో సీనియర్ ప్రొఫెసర్ పదోన్నతులపై జరిగిన అక్రమాలపై నియమించిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని బహిర్గతం చేయాలని ఏఐఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ డిమాండ్ చేసింది.
ఈమేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.వీ. బాలకిష్టారెడ్డిని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, సహాయ కార్యదర్శి గ్యార నరే ష్, ఓయూ అధ్యక్షులు లెనిన్, నాయకులు అశ్విన్‌లు కలిసి శనివారం వినతిపత్రం సమర్పించారు.
ఇటీవల చేపట్టిన ప్రమోషన్లలో కొంతమంది ప్రొఫెసర్లకు జరిగిన అన్యాయంపై గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి అర్హత కలిగిన ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని కోరారు. గతంలో అర్హతలేని వారికి పదోన్నతులు కల్పిస్తే, ఈసారి అన్నీ అర్హతలున్న వారికి ప్రమోషన్లలో అన్యాయం జరిగిందని వారు ఒక ప్రకటనలో ఆరోపించారు.