26-12-2025 12:43:12 AM
తానే భరిస్తానంటున్న తాహసిల్దార్ రాధాకృష్ణ
రాజాపూర్ డిసెంబర్ 25: తాసిల్దార్ కార్యాలయం అంటేనే డబ్బులతో కూడుకున్న వ్యవహారం అంటూ ఎవరైనా టక్కున చెప్పే దాఖలాలు లేకపోలేదు. ఎవరికో ఒకరికి కొంతైనా ముట్ట చెబితేనే తమ పనులు అవుతాయని పలువురు ప్రత్యేకంగా చర్చించుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
కాగా జిల్లాలో మొదటిసారిగా రాజపూర్ మండల తాసిల్దార్ రాధాకృష్ణ విద్యార్థులకు కుల ఆదాయ ధ్రువీకరణ పత్రల ఖర్చులు తామే భరిస్తామంటూ ప్రకటన జారీ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజంగానే విద్యార్థులకు కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో ప్రభుత్వానికి చెల్లించే ఖర్చు తాసిల్దార్ అందిస్తామని చెప్పడం ఆ మండల పరిధిలోని విద్యార్థులకు ఎంతో మేలు ఉపయోగం ఉండనున్నది.
ఉపాధ్యాయులకు తాసిల్దార్ సూచన
మండల పరిధిలో గల ఆయా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా కులం, ఆదాయ ధ్రువ పత్రాలు అందిస్తామని తాసిల్దార్ రాధాకృష్ణ గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. విద్యార్థులసంక్షేమం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన ఉచిత స్కాలర్ షిప్ కోసం ఈ సేవలు అందిస్తామని తెలిపారు. విద్యార్థుల కులం, ఆదాయ ధ్రువపత్రములకై అప్లికేషన్స్ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లీస్ట్ తయారు చేసి మండల విద్యాధికారితో తాసిల్దార్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
పదవ తరగతి లోపు అర్హులైన విద్యార్థులందరికి ధ్రువపత్రములకు అయ్యే ఖర్చును తాసిల్దార్ వెచ్చించి ధ్రువపత్రములు జారీ చేస్తామని చెప్పడం మండల వ్యాప్తంగా పలువురు తాసిల్దార్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
సహాయం చేయాలని ఆలోచనతోనే..
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఏదో కొంత సహాయం చేయాలనే ఆలోచనతోనే కుల ఆదయ దృవీకరణ పత్రాలు ఖర్చు తామే భరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ విషయాన్ని అన్ని గ్రామాలతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కుల ఆదయ దృవీకరణ పత్రాల ఖర్చులు ఇవ్వవలసిన అవసరం లేదు. పూర్తిస్థాయిలో భరించి వారికి ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాను.
- రాధాకృష్ణ, తహసిల్దార్, రాజాపూర్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా