calender_icon.png 26 December, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిస్మస్ వేడుకలలో సుడా చైర్మన్

26-12-2025 02:37:36 AM

కరింనగర్ క్రైం, డిసెంబర్25(విజయక్రాంతి):క్రిస్మస్ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నగరంలోని పలు చర్చిలు సందర్శించారు.ముందుగా సిఎస్‌ఐ చర్చిలోజరిగిన వేడుకలలో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.క్రిస్మస్ కేక్ కట్ చేసి పాస్టర్ కు తినిపించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి యేసు క్రీస్తు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.క్రిష్టియన్ ల అభ్యున్నతికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం నగరంలోని పలు చర్చిలు సందర్శించి శుభాకాంక్షలు తెలియజేశారు.