calender_icon.png 26 December, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిలుక పలుకులు పలుకుతున్న మాజీ మంత్రికి ఆనాడు, ఈనాడు ఉన్నది తెలుసు..

26-12-2025 12:55:12 AM

  1. కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబెర్ నుండి మంత్రిగా ఎదిగా: మంత్రి వాకిటి శ్రీహరి 

భజనలు చేయడం కాదు  వాస్తవాలను సీఎం దృష్టికి తీసుకెళ్లండి.... మాజీ ఎంపీ వి హెచ్ హనుమంత్ రావు 

పాలమూరు రంగారెడ్డి మీద ఎవరి తోనే వ్యాసాలు రాసి ఆయన పేరు పెట్టుకుంటాడు.. ఎమ్మెల్యే మేఘా రెడ్డి 

పార్టీ కోసం పని చేయని వాళ్లకు పదవులునండవు.... రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్, జిల్లా డిసిసి అధ్యక్షులు శివ సేనా రెడ్డి

వనపర్తి, డిసెంబర్ 25 ( విజయక్రాంతి )  :  వనపర్తి లో చిలుక పలుకులు పలుకుతున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కి ఆనాడు ఉన్నది ఈనాడు ఉన్నది ఏంటో తనకు తెలుసునని పర్యాటక, అబ్కారి శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు  వ్యాగంగా విమర్శించారు. గురువారం కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు గా రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి  పదవి భాద్యతలు చేపట్టారు. ముందుగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి తో కలిసి శివ సేనా రెడ్డి జిల్లా కేంద్రం లో పార్టీ కార్యాలయం ను ప్రారంభించి అనంతరం ఓ ప్రవేట్ ఫంక్షన్ హల్ లో సమావేశంను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణా రావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 22 మంది సి ఎం లు చేసిన అప్పు 60 వేల కోట్లు అప్పు చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రాజెక్టు లు నిర్మిస్తే గడిచిన 10 ఏండ్లలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందని అందుకు సంబందించి మిత్తిలను కడుతు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

అక్షయ పాత్ర లాంటి రింగ్ రోడ్డు ను గత ప్రభుత్వం రూ 7 వేల కోట్ల కు అమ్మి రైతు భరోసా కింద 5 వేల కోట్లు ఇచ్చారని వరుస విజయాలు కాంగ్రెస్ సాదిస్తున్నా రని గ్రహించి న కే సి ఆర్ బయటకు వచ్చి తోలు తీస్తాము అని అంటున్నాడని ఆయన విమర్శించారు. 

కాంగ్రెస్ పార్టీ లో వార్డు మెంబెర్ నుండి మంత్రిగా ఎదిగా.... రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి 

కాంగ్రెస్ పార్టీ లో వార్డు మెంబెర్ నుండి మంత్రి వరకు అయ్యాయని పని చేసే ప్రతి ఒక్కరిని గుర్తించేది కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వనపర్తి లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అందుకు నిదర్శనం మేఘా రెడ్డి ఎమ్మెల్యే, చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, శివ సేనా రెడ్డి రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్, జిల్లా డిసిసి అధ్యక్షులు పదవులు తెచ్చుకున్నారన్నారు.

2009, 2014, 2018 ల టికెట్ రాలేదు కాంగ్రెస్ పార్టీ వీడలేదని అందుకే 2023 టికెట్  వచ్చిందని మక్తల్ నియోజకవర్గ ప్రజలందరు ఆశీర్వదించి ఎమ్మెల్యే ను చేస్తే సి ఎం రేవంత్ రెడ్డి నన్ను మంత్రిని చేసారన్నారు. 

సి ఎం దగ్గర భజన చేయకండి వాస్తవాలు చెప్పండి....మాజీ ఎంపీ విహెచ్ హనుమంత్ రావు 

సి ఎం రేవంత్ రెడ్డి దగ్గర మంత్రులు భజన చేయవద్దని ప్రజా క్షేత్రంలో  ఉన్న ఇబ్బందుల గురుంచి వాస్తవాలను చెప్పాలని మాజీ ఎంపీ విహెచ్ హనుమంత్ రావు అన్నారు. పాలమూరు అంటే గతంలో వలసలు ఉండే ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాలమూరు బిడ్డ సిఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. 

పాలమూరు రంగారెడ్డి మీద ఎవరి తోనే వ్యాసాలు రాసి ఆయన పేరు పెట్టుకుంటాడు.... ఎమ్మెల్యే మేఘా రెడ్డి 

కే ఎల్ ఐ, బుద్దారం రైట్, లెఫ్ట్ కెనాల్, అన్ని కాంగ్రెస్ పార్టీ లో ఉన్నపుడు జరిగిందని అక్కడక్కడా బొక్కలు కొట్టి నేను నీళ్లు తెచ్చిన అని ఇక్కడ ఉన్న బి ఆర్ ఎస్ నాయకుడు చెప్పుకుంటున్నాడని పాలమూరు రంగారెడ్డి మీద ఎవరి తోనే వ్యాసాలు రాయించుకుని ఆయన పేరు పెట్టుకుంటాడని ఎమ్మెల్యే మేఘారెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పై విమర్శలు చేశారు. 

వనపర్తి నియోజకవర్గం లో  90 మంది సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారని ఈ సందర్బంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుతున్నామని 90 మందిలో సగం మంది మహిళ సర్పంచ్ లు ఉన్నారు కానీ ఈ కార్యక్రమం కు సర్పంచ్ లు రాలేదు గిర్పంచ్లు వచ్చారు ఇప్పటి నుండి సర్పంచ్ లు రావాలన్నారు.  వనపర్తి లో ఒకటే కాంగ్రెస్ ఉందని కార్యకర్తల అభివృద్ధి కోసం నాలుగు మెట్లు దిగడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే వివరించారు. 

పార్టీ కోసం పని చేయని వాళ్లకు పదవులునండవు....  రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్, జిల్లా డిసిసి అధ్యక్షులు శివ సేనా రెడ్డి 

కార్యకర్తలను కాపాడుకోలేని వారిని పని చేయని మండల అధ్యక్షులను తొలగిస్తామని పార్టీకి పని చేయకుండా పదవులు కావాలంటే మాత్రం కాదని నాకు వాళ్లు తెలుసు వీళ్ళు తెలుసు అంటే సరిపోదని ఎవరు చెప్పిన వినే ప్రసక్తే లేదని రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్, జిల్లా డిసిసి అధ్యక్షులు శివ సేనా రెడ్డి అన్నారు. సాధారణ కార్యకర్త కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి కష్టసుఖాలు అన్ని తెలుసునని కరుడు కట్టిన కార్యకర్తలకు అన్ని పదవులు వస్తాయని అవకాశాలు ఇస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఆయా మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.