16-11-2025 07:32:40 PM
కమాన్ పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు
రామగిరి (విజయక్రాంతి): రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రైతులు పండించిన ప్రతి వరి గింజను కొనుగోలు చేస్తామని ఇది రైతు ప్రభుత్వమని కమాన్ పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు అన్నారు. మండలంలోనీ లొంగకేసారం, కల్వచర్ల, నవాబ్ పేట, రత్నాపూర్, లద్నా పూర్, రాజాపూర్, ముస్త్యాల గ్రామాల్లో ఇందిరా క్రాంతి పథకం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్ లతో కలిసి ఏఎంసి చైర్మన్ వైనాల రాజు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కస్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు.
ప్రభుత్వం మద్దతు ధరతో రైతులకు మేలు చేసే విధంగా గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి రైతుకు సౌకర్యకరంగా గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి దక్కిందని పేర్కొన్నారు. గత సర్కార్ పాలు తప్ప ఐదు కిలోల వరకు కోత విధించేవారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శైలజ రాణి, వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గుగులోతు ప్రవీణ్ నాయక్, సిద్ధం మురళీకృష్ణ, ఆరెల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ ఎండి మంజూర్, ఆరెల్లి కొండయ్య, ముత్యాల శ్రీనివాస్, వరం రామచంద్రరావు, స్వామి గౌడ్, కాటసత్యం, లల్లు తదితరులు పాల్గొన్నారు.