29-12-2025 06:57:20 PM
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రలోని సుప్రసిద్ధ మాకుల స్వయంభూ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో సోమవారం ఉత్సవ మూర్తులకు ఘనంగా స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అనువంశిక అర్చకులు నల్లాన్ చక్రవర్తుల లక్ష్మణ చార్యుల ఆధ్వర్యంలో శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకం, చక్ర స్నానం, స్నపన తిరుమంజన కార్యక్రమం వేద మంత్రశ్చరణల మధ్య నేత్ర పర్వంగా కొనసాగింది. కలియుగంలో హరినామ సంకీర్తన ద్వారా భగవంతుని సులభంగా పొందవచ్చని గోదాదేవి తన పాశురాల ద్వారా లోకానికి చాటుకున్న తీరును భక్తులకు అనుగ్రహ భూషణం చేశారు. అనంతరం సామూహిక విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం చేశారు.