calender_icon.png 29 December, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే వేముల వీరేశం చిత్రపటానికి పాలాభిషేకం

29-12-2025 07:04:38 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల పట్టణంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాటి దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో లారీల ఓనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో ప్రస్తావించి సమస్యలను పరిష్కరించాలని కోరడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం.

గతంలో ఆరు సంవత్సరాలు దాటిన లారీల రెన్యువల్ 1000 ఉండేదని దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెంచుకుంటూ నేడు లారీల ఫిట్ నెస్ ల ఛార్జీ 30వేలు చేసింది. ఇది సామాన్య లారీ ఓనర్ లకు భారంగా మారుతుందని అన్నారు. ప్రభుత్వం కల్పించుకొని లారీల ఫిట్నెస్ చార్జీల విషయంలో వెసులుబాటు కల్పించాలని ఈ సందర్భంగా కోరారు.