29-12-2025 06:49:29 PM
-సూర్యాపేట జిల్లా డీఈఓ అశోక్
హుజూర్ నగర్: సిఆర్పి రమేష్ మృతి అత్యంత బాధాకరమని సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. మండల పరిధిలోని లింగగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్పి రమేష్ గత రెండు నెలల క్రితం మృతి చెందాడు. హుజూర్ నగర్ మండలంలో పనిచేయుచున్న ఉపాధ్యాయులందరూ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వారు జిల్లా స్థాయి సిఆర్పిలు, ఎంఆర్సి సిబ్బంది సహృదయంతో తోటి ఉద్యోగస్తుడు మృతి చెందడంతో బాధిత కుటుంబానికి అండగా నిలిచి 2 లక్షల 20వేలు పిక్స్ డ్ డిపాజిట్ ను సోమవారం డిఈఓ అశోక్ చేతులమీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా డిఈఓ అశోక్ మాట్లాడుతూ... సిఆర్పి రమేష్ కుటుంబానికి జిల్లా విద్యాశాఖ తరఫున ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు.