29-12-2025 07:07:34 PM
- మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు
సిద్దిపేట,(విజయక్రాంతి): వినియోగదారులకు నాణ్యమైన చికెన్ అందించాలని సిద్దిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు సూచించారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మైత్రివనం వద్ద ఆర్ఆర్ చికెన్ మార్కెట్ ను ప్రారంభించి, నిర్వాహకులు రాజేష్ రాజు లను అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువత ఉద్యోగాల వైపు పరిగెత్తకుండా స్వయం ఉపాధి పై దృష్టి సారించాలని సూచించారు. ఆర్ఆర్ చికెన్ మార్కెట్ బ్రాండ్ గా ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంపత్ రెడ్డి, పార్టీ నాయకులు ఎల్లగారి కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.