calender_icon.png 29 December, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నంగునూరు మండల ఉప సర్పంచుల ఫోరం ఎన్నిక ఏకగ్రీవం

29-12-2025 07:01:17 PM

నంగునూరు: నంగునూరు మండల కేంద్రంలో సోమవారం ఉపసర్పంచుల ఫోరం ను  ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.ఫోరం మండల శాఖ  అధ్యక్షులుగా నంగునూరుకు చెందిన కోల శ్రీధర్ గౌడ్ ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా తిప్పని శ్రీనివాస్ (గట్లమల్యల), రేపాక లలిత –రాజేందర్ (బద్దిపడగ), జనరల్ సెక్రటరీగా  కుంచం విక్రమ్ (నర్మెట్ట), కార్యదర్శులుగా లాస్య నర్సింలు (మగ్దూంపూరు), కాటం హారిక–రాజేష్ (రాజగోపాలపేట), కోశాధికారిగా బొడిగే తిరుపతి గౌడ్ (రాంపూర్), ఆర్గనైజింగ్ సెక్రటరీగా వీరన్న పేట రమేష్ గౌడ్ (అప్పలయచెరువు) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన మండల సర్పంచ్ల ఫోరం సభ్యులను మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మండల ఇన్చార్జి గుండు భూపేష్, మండల పార్టీ అధ్యక్షులు లింగం గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి తదితరులున్నారు.