calender_icon.png 15 September, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం

15-09-2025 12:00:00 AM

నూతనకల్, సెప్టెంబర్ 14 : మండల కేంద్రంలోని సమతా పారామెడికల్ కాలేజీ ఆవరణలో లయన్స్ క్లబ్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. లయన్ డాక్టర్ కటకం అనిల్ కుమార్ గుండె ఆరోగ్యానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సూచనలు, సలహాలు ఇచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి కాల పరిస్థితులలో చిన్న పెద్ద వయసు తేడాలు లేకుండా అన్ని వయసుల వారికి హార్ట్ ఎట్టాక్ మొదలగు గుండె ఆనారోగ్య సమస్యలు సర్వసాధారణంగా వస్తున్నాయన్నారు.

కావున ఇటువంటి ఉచిత గుండె వైద్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకొని ప్రాథమిక దశలో సమస్యను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రమాదాలను  నివారించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బందు కృష్ణయ్య, క్లబ్ వైస్ ప్రెసిడెంట్  సాదు రామకృష్ణరెడ్డి, కోశాధికారి బయ్య రవీందర్, ఎల్ సి ఐ ఎఫ్ కోఆర్డినేటర్  ఏలేటి నారాయణ రెడ్డి, బోర్డు డైరెక్టర్ షేక్ నాగుల్ మీరా, అడ్మినిస్ట్రేటర్ సాబాది వెంకట్ రెడ్డి, ధీకొండ వీరన్న, మధురమ క్లినిక్ సిబ్బంది మరియు మాతా డయాగ్నోస్టిక్స్ & పాలీ క్లినిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.