calender_icon.png 20 November, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్రీడమ్ వారి కోచింగ్ ది కోచ్ ప్రారంభం

20-11-2025 01:02:24 AM

డీఆర్‌ఎస్ వర్సెస్ పీఆర్‌ఎస్‌ను వివరిస్తూ రాహుల్ ద్రవిడ్‌తో ప్రచారం

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 19 (విజయక్రాంతి): ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ వారు వంట నూనె పరిమాణాన్ని తనిఖీ చేయడం గురించి వినియోగదారులలో అవగాహన పెంచడానికి డిఆర్‌ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్) వర్సెస్ పిఆర్‌ఎస్ (పా రివ్యూ సిస్టమ్) భావనను ఉపయోగించి తమ కొత్త ‘కోచింగ్ ది కోచ్’ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో రాహుల్ ద్రవిడ్ ప్రముఖంగా కనిపిస్తారు. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, ప్రతి ఒక లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో 910 గ్రాముల నూనె ఉండాలి.

అయితే, కొన్ని బ్రాండ్లు లీటరు తరహా లో కనిపించే ప్యాక్ లో తక్కువ పరిమాణంలో నూనె అందిస్తున్నాయి. వినియో గదారులు నష్టపోకుండా ఉండటానికి, నూనె కొనుగోలు చేసే ముందు వంట నూనె పరిమాణాన్ని తనిఖీ చేసేందుకు ఈ ప్రచారం ప్రోత్సహిస్తుంది. ఒక లీటరు ప్యాక్ లాగా కనిపించినప్పటికీ తక్కువ నూనె ఉన్న పొరను కొనుగోలు చేసి మోసపోవద్దని, ఈ అంశాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఇది కోరుతుంది. ‘కొనుగోలు చేసే ముందు తనిఖీ చేయండి. సరైనదాన్ని, ఫ్రీడమ్‌ను ఎంచుకోండి’ నినాదంలో ముందుకెళ్తున్నారు.

ఫ్రీడమ్ ఆయిల్ 101 నాణ్యత తనిఖీలు, ఆధునాతన రిఫైనింగ్ సాంకేతికత వినియోగిస్తోంది. ఈ సందర్భంగా జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి. చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ‘మా ప్రచారం వినియోగదారుల అవగాహన పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. వినియోగదారులకు వారి హక్కుల గురించి తెలియజే యడం, మార్కెట్లో వారు ఏమి కొనుగోలు చేస్తున్నారో వారు అర్ధం చేసుకోవడంను మేము నమ్ముతాము’ అన్నారు.