20-11-2025 01:02:09 AM
జనగామ,నవంబర్ 19 (విజయక్రాంతి):మంగళవారం రోజున జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జనగామ టౌన్, జనగామ రూరల్, నర్మెట్ట, తరిగొప్పుల మరియు బచ్చన్నపేట మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్ల మాట్లాడుతూ.. జనగామను ఆరోగ్య జనగామగా చూడడమే నా లక్ష్యం అని అన్నారు.
గత రెండు సంవత్సరాలుగా నేను ఇచ్చిన మాట ప్రకారం ఘ ట్కేసర్ లోని నా సొంత నీలిమ హాస్పిటల్ లో నియోజకవర్గ ప్రజలందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నాను. రాబోయే మూడు సంవత్సరాలు కూడా ఇదే విధంగా కొనసాగిస్తాను అని తెలి పారు.మా హాస్పిటల్లో లేని ప్రత్యేక వైద్య సేవల కోసం నిమ్స్ లేదా ఇతర వైద్యులతో సమన్వయం చేసి మంచి చికిత్స అందేలా చూస్తున్నాం అని చెప్పారు.
అవసరమున్న వారికి ఎల్ ఓ సి కూడా జారీ చేస్తున్నము అన్నారు.డబ్బులు ఖర్చు చేసి చికిత్స చేయించుకున్న వారికి సిఎంఆర్‌ఎఫ్ చె క్కులు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం. అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్ పర్సన్ పోకల జమున, కౌన్సిలర్ ప్రేమలత రెడ్డి, అనిత వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ బల్దే సిద్ధులు, తాళ్ల సురేష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జూమ్ లాల్, తాళ్లపల్లి రాజేశ్వర్ గౌడ్, ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.