calender_icon.png 22 July, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్య చేతిలో భర్త హతం!

22-07-2025 12:25:21 AM

- హత్యకు సహకరించిన తండ్రి

- పోలీసుల అదుపులో తండ్రి, కూతురు 

వికారాబాద్, జూలై- 21 (విజయక్రాంతి): భార్య చేతిలో భర్త దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరు మండ లం మల్కాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మల్కాపూర్ గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేష్(32) ఆదివారం అర్ధరాత్రి హత్యకు గురయ్యా డు.

సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచా రం అందించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య జయశ్రీ, ఆమె తండ్రి పండరి సహకారంతో భర్తను హత్య చేసినట్లు గ్రామస్థులు అనుమానిస్తూ నిలదీశారు. దీంతో తన తండ్రి సహాయంతో తన భర్త మెడకు ఉరివేసి చంపినట్లు ఒప్పుకున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు తాండూరు రూరల్ సీఐ నగేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారి స్తున్నట్లు సీఐ తెలిపారు.