calender_icon.png 28 December, 2025 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఫ్రెషర్స్ డే

27-12-2025 11:46:26 PM

ప్రారంభించిన వర్సిటీ డైరెక్టర్ దాసేశ్వరరావు 

హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా భూదా న్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం మొదటి సంవత్సరం విద్యార్థులను ఆహ్వానిస్తూ సీనియర్ విద్యార్థులు ‘ఫ్రెషర్స్ డే’ వేడుకలు నిర్వహించారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా, సామాజిక స్పృహ కలిగి ఉండాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

విజ్ఞాన్స్ అందించే నాణ్యమైన విద్యను, నైపుణ్యాలను అందిపుచ్చుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని పేర్కొన్నారు. తమ యూనివర్సిటీలో విద్యార్థులు స్వేచ్ఛగా విద్యనభ్యసించవచ్చునన్నారు. ఏమైనా ఇబ్బందు లు తలెత్తితే మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చునని తెలిపారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫ్రెషర్స్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, వి ద్యార్థులు పాల్గొన్నారు.