calender_icon.png 20 September, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతోనే స్నేహభావం పెంపొందుతుంది

20-09-2025 12:16:48 AM

అట్టహాసంగా ఎస్జిఎఫ్ పోటీలు ప్రారంభం

రాజాపూర్ సెప్టెంబర్ 19:  విద్యార్థులు చదువుతోపాటు క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు స్నేహభావం పెంపొందిస్తుందని ఎంఈఓ సుధాకర్, జనంపల్లి శశికళ రెడ్డి అన్నారు శుక్రవారం మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 14  క్రీడా పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు.

క్రీడా పోటీలకు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు,కేజీబీవీ పాఠశాల ప్రతిభ పాఠశాల, అగస్త్య విద్యాలయం, అలాగే రంగారెడ్డి గూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం భాగంగా నిర్వహించిన విద్యార్థుల నృత్యలు అహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడా పోటీల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించినప్పుడే మనసు నిశ్చలంగా ఉంటుందని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద ఉండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలకు నూతన శోభ సంతరించుకుందని అన్నారు. వచ్చే నెలలో జరుగు సీఎం కప్పు  పోటీల కోసం విద్యార్థు లు తమ ఆటలను మెరుగుపరచుకొని ఉత్తమ ప్రతిభ కనబరచాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్,తాసిల్దార్ రాధాకృష్ణ,ఎంపీడీవో విజయలక్ష్మి, ఎస్సు శివానంద్ గౌడ్, నాయకులు బచ్చిరెడ్డి, యాదయ్య,సత్యనారాయణ గౌడ్, నరసింహులు, శ్రీకాంత్ రెడ్డి, నరేష్, కృష్ణ, శివకుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.