03-01-2026 12:29:46 AM
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభత్వం బీసీ ఉద్యో గులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ నిబంధన ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెండు రాష్ట్రాల బీసీ ఉద్యోగుల సదస్సు జరుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఈ సభకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సబితా, కొల్లు రవీందర్ తదితరులు మంత్రివర్గ సభ్యులు హాజరవుతారని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెడతామన్నారన్నారు. బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టడానికి చట్టపరమైన, రాజ్యంగా పరమైన, న్యాయపరమైన అవరోధాలు, అడ్డంకులు ఏమీలేవన్నారు. రాజ్యాం గ బద్ధమైన మండల్ కమీషన్ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సు చేసిందన్నారు.
చట్టబద్ధమైన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ నాచియప్పన్ కమిటీ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సు చేసిందన్నారు. ఇక ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ రిజర్వేషన్ల కేసు సందర్భంగా జనాభా ప్రకారం ఉద్యోగుల సంఖ్య లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని తీర్పు చెప్పిందన్నారు. అన్ని వైపుల నుంచి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని బలమైన సిఫార్సులున్నాయని, అయిన ప్పటికీ కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. కేంద్రంలో ఖాలీగా యున్న16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.