14-09-2025 01:15:22 AM
మల్కాజిగిరి, సెప్టెంబర్ 13(విజయక్రాంతి) : గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో పెండింగ్ ఉన్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కార్పొరేటర్ మేకల సునీత రామ యాదవ్ జోనల్ కమిషనర్ రవికిరణ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ పెండింగ్ పనుల కోసం అవసరమైన నిధుల మంజూరుకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.
కార్పొరేటర్ మాట్లాడుతూ గౌతమ్ నగర్ డివిజన్లో రోడ్లు, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్ వంటి అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో మున్సిపల్ అధికారులు సహకరిస్తున్నారని, త్వరలోనే ప్రజలకు ఫలితాలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్ర మంలో బీఆర్‌ఎస్ నాయకులు మేకల రామ్ యాదవ్, విజయ్‌లు పాల్గొన్నారు.