calender_icon.png 11 December, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నాయకుడు సమద్ నవాబ్

11-12-2025 12:03:19 AM

అంత్యక్రియల్లో మంత్రి శ్రీధర్ బాబు 

కరీంనగర్, డిసెంబరు 10 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు కుటుంబాలను మంత్రి శ్రీధర్ బాబు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కలిసి పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జిల్లా వక్ఫ్ బోర్డు ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ సమద్ నవాబ్ అంత్యక్రియల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సమద్ నవాబ్ చేసిన సేవలను కొనియాడారు. కరీంనగర్ లోని మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ తండ్రి మెండి శంకరయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆయన కుటుంబ సభ్యులను మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం కాంగ్రెస్ మహిళా నేత అవాలా సరోజమ్మ ఇటీవల మరణించగా ఆమె కుటుంబ సభ్యులను శ్రీధర్ బాబు పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ తదితరులుపాల్గొన్నారు.