calender_icon.png 11 December, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘తొలి’ ఎన్నికలు నేడే..!

11-12-2025 12:04:46 AM

  1. ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల ప్రకటన

పటిష్ట పోలీసు బందోబస్తు, వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు

వంద మీటర్ల దూరం వరకు నో ఎంట్రీ

కరీంనగర్, డిసెంబరు 10 (విజయ క్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి ఆ తర్వాత ఓట్లను లెక్కిస్తారు. ఫలితాలు కూడా గురువారం రాత్రి వెలువడనున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు ఈ ఎన్నికలు పార్టీ గుర్తుపై కాకున్నా తమ బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం మొదటి విడతలో 389 గ్రామాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 20 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 369 గ్రామాల్లో నేడు ఎన్నికలు జరగనున్నాయి.

కరీంనగర్లో 89, పెద్దపల్లిలో 95, రాజన్న సిరిసిల్లలో 67, జగిత్యాలలో 118 గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల దృష్ట్యా నాలుగు జిల్లా ల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సున్నిత, సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలను మొహరించడంతోపాటు వెబ్ కాస్టింగ్, మైక్రో పరిశీలకులను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో స్టాటిక్ పోలీస్ పార్టీ, ప్రతి మార్గంలో రూట్ మొబైల్ పార్టీలను ఏర్పాటు చేశారు.

ఎన్నికలు జరిగే ప్రతి మండలానికి కార్పొరేషన్ ప రిధిలో ఏసీపీ స్థాయి, జిల్లాల పరిధిలో డీఎ స్పీ స్థాయి అధికారులను ఇంచార్జీలుగా ని యమించారు. వారి ఆధీనంలో స్పెషల్ స్ట్రై కింగ్ ఫోర్స్ ను కేటాయించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారతీయ నాగరిక్ సు రక్ష సంహితలోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పో లింగ్ కేంద్రాల పరిసరాల్లో వంద మీటర్ల వ రకు ప్రచారం, గుర్తులతో గుంపులుగా గుమిగూడి ఉండడం పూర్తిగా నిషేధం. పోలింగ్ స్టేషన్లలో మొబైల్ ఫోన్లు, ప్రచార సామాగ్రి నిషేధించారు.

కరీంనగర్ జిల్లాకు వస్తే కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికల బం దోబస్తు కోసం 782 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు కమిషనర్ గౌస్ ఆ లం తెలిపారు. ఇందులో ఆరుగురు ఏసీపీ లు, 19 మంది ఇన్ స్పెక్టర్లు, 40 మంది ఏఎస్‌ఐలు, 34 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 392 మంది కానిస్టేబుళ్లు, 47 మంది స్పెషల్ యా క్షన్ టీం పోలీసులు, 144 మంది హోంగార్డులు, వంద మంది స్పెషల్ బెటాలియన్ పోలీసులు ఉన్నారు. అలాగే సమాచారాన్ని వేగవంతంగా చేరవేసేందుకు రిపీటర్, బేస్ సెంటర్లను ఏర్పాటు చేసి వైర్లెస్ సెట్లను సి ద్ధంగా ఉంచారు.

పోలింగ్ పూర్తయిన తర్వా త బ్యాలెట్ బాక్సులను లెక్కింపు కేంద్రాలకు తరలించే ప్రక్రియ కట్టుదిట్టమైన భద్రతల మధ్య పోలీసుల నిరంతర నిఘాలో జరగనుంది. పోలింగ్, ఫలితాలు ఒక్కరోజే ఉం డడంతో అన్ని జిల్లాల్లో విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించారు. మొదటి విడత పోలింగ్ జరగనున్న కేంద్రాలకు పోలింగ్ సి బ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి సామాగ్రితో బుధవారం సాయంత్రమే తరలి వెళ్లా రు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించి దిశానిర్దేశనంచేశారు.