calender_icon.png 30 July, 2025 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిర్గాపూర్ నూతన ఎస్సైగా జి.మహేశ్

24-07-2025 12:04:12 AM

సిర్గాపూర్, జులై 23: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్త్స్ర గా జి.మహేష్ ను నియమిస్తూ ఎస్పీ పరితోష్ పంకజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకాలం ఇక్కడ ఎస్త్స్ర గా పని చేసిన వెంకట్ రెడ్డి గత రెండు నెలల క్రితం సీఐగా పదోన్నతి పొందారు. అయితే ఇప్పటివరకు సిర్గాపూర్ ఎస్.హెచ్.వో గా కొనసాగుతున్నారు.

గత రెండు నెలల నుంచి స్థానికంగా ట్రైనీ ఎస్త్స్రగా పనిచేస్తున్న జి.మహేష్ ను రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎస్త్స్ర మహేష్ మాట్లాడుతూ... మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటానని, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తామని తెలి పారు. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని ఎస్‌ఐ మహేష్ తెలిపారు.