24-07-2025 12:03:51 AM
చొప్పదండి, జూలై23(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల పాఠ్య పుస్తకాలకు సంబంధించిన బ్యాగు పది కిలోలు ఉండడంతో విద్యార్థులకు భారంగా మారి ఇబ్బంది పడుతున్నారు.గంగాధర మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు ప్రత్యేక చొరవ చూపించి అన్ని విషయాలను కవర్ చేస్తూ బడి బ్యాగు కేవలం మూడు కిలోలు మాత్రమే ఉండేలా కొత్త పుస్తకాలను ఇచ్చారు.
దీంతో విద్యార్థులు ప్రతిరోజు కిలోలు మాత్రమే ఉండే బడి బ్యాగ్ తో ఏ ఇబ్బంది లేకుండా పాఠశాలకు వస్తున్నారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుధవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. బడి బ్యాగు తేలికగా ఉండేలా చర్యలు తీసుకున్న ఎంఈఓ ప్రభాకర్ రావును ఎమ్మెల్యే అభినందించారు.రాష్ట్ర ఎడ్యుకేషనల్ డైరెక్టర్ నికోలస్ తో ఫోను మాట్లాడి ఎంఈఓ పనితీరును వివరించారు.గట్టుభూత్కూరు ప్రభుత్వ పాఠశాల లో అనుసరిస్తున్న మూడు కిలోల విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంఈఓ ప్రభాకర్ రావునుసన్మానించారు.