calender_icon.png 31 July, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ముందంజలో ఉండాలి

24-07-2025 12:04:19 AM

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ

తాడ్వాయి, జూలై, 23( విజయ క్రాంతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి ముందంజలో ఉండాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ తెలిపారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో బుధవారం స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో బిజెపి చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు.

నరేంద్ర మోడీ దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేదోడు వాదోడు గా నిలుస్తున్నారని తెలిపారు ప్రపంచంలోనే భారతదేశం గుర్తింపు పొందుతుందని ఆమె తెలిపారు మాజీ మంత్రి నేరెళ్ళ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని బిజెపి ని కోరుకుంటున్నారని తెలిపారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి బాలల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గడపగడపకు బిజెపి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి, నాయకులు  గంగారెడ్డి, లింగారావు, నరసారెడ్డి, వెంకట్రావు, హోటల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.